Households GeoTagging Survey in AndhraPradesh Full Details

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు సమర్ధవంతముగా అమలు చేయడానికి Household Geotagging అనే survey ని ప్రారంభించటం జరిగినది. ఈ సర్వే నవంబర్ 15 వ తారీఖు లోగా పూర్తి చేయాలి అని ఆదేశించి ఉన్నారు . ఈ సర్వే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వారి యొక్క సచివాలయ పరిధి లో గల households ని సర్వే చేస్తారు. ఈ సర్వే చేయు విధానం మరియు పూర్తి వివరాలు క్రింద తెలియజేయటం అయినది.

Households GeoTagging Survey :

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తమకు mapping చేసినటువండి క్లస్టర్ లోని ప్రతి ఇంటికి geotag చేయవలెను. ఈ సర్వే చేయటానికి ప్రభుత్వం వారు Playstore  లో Employee Mobile Application అను App ను రూపొందించటం జరిగినది. ఈ app ను కింద ఇవ్వబడిన లింకు ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. ఈ app డౌన్లోడ్ చేసిన తరువాత secretary వారు తమ యొక్క Login ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క లాగిన్ ( Sachivayalam code – Designation) అను విధం గా ఉంటుంది. లాగిన్ చేసేటపుడు biometric లేదా Facial ఇవాల్సి ఉంటుంది.

App Link :  Employee Mobile Application

Login Id : Sachivayalam code – Designation

ఈ సర్వే యొక్క పూర్తి విధానం కింద తెలియజేయటం అయినది.

1. Download App :

పైన ఇచ్చినటువంటి లింకు ద్వారా playstore నుండి app ను డౌన్లోడ్ చేసుకోగలరు. డౌన్లోడ్ చేసిన తరువాత app ఈ విధం గా కనిపిస్తుంది

GeoTagging Survey

 

App ఓపెన్ అయిన తరువాత మీ యొక్క Biometric లేదా Facial లేదా Iris ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒక సారి లాగిన్ అయితే మీ యొక్క లాగిన్ అనేది కొంత సేపు మాత్రమే ఉంటుంది. తరువాత తిరిగి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

2. HH GEO LOCATION :

App ఓపెన్ అయిన తరువాత HH GEO LOCATION అనే దాని పిన క్లిక్ చేయాల్సి ఉంటుంది. HH GEO LOCATION ను క్లిక్ చేసిన తరువాత ఈ విషయం గా చూపిస్తుంది

GeoTagging Survey

HH GEO LOCATION లో మీరు ఈ సర్వే చేయాల్సి ఉంటుంది. HH GEO LOCATION మీద క్లిక్ చేసిన తరువాత మీ యొక్క సచివాలయం లో ఉన్న అన్నీ క్లస్టర్ లు చూపించటం జరుగుతుంది. అందులో మీకు అసైన చేసిన క్లస్టర్ ను ఎంచుకోవాలి

3. Select Cluster :

HH GEO LOCATION మీద క్లిక్ చేసిన తరువాత మీ యొక్క సచివాలయం లో ఉన్న అన్నీ క్లస్టర్ లు చూపించటం జరుగుతుంది. అందులో మీకు అసైన చేసిన క్లస్టర్ ను ఎంచుకోవాలి. ఇందులో మీకు ఇచ్చిన క్లస్టర్ లో ని అన్నీ ఇండ్లకు ఈ సర్వే చేయాల్సి ఉంటుంది. Household మప్పింగ్ లో ఉన్న ప్రతి ఇంటికి ఈ సర్వే చేసి పూర్తి చేయ వలేను.

మీ యొక్క క్లస్టర్ ను సెలెక్ట్ చేసిన తరువాత ఈ విధం గా చూపిస్తుంది.

Geotaging Survey

4. Geotagging Process  :

మీ యొక్క క్లస్టర్ ను సెలెక్ట్ చేసిన తరువాత అందులో ఉన్నటువంటి ప్రతి ఇంటికి యొక్క డీటైల్స్ ను చూపిస్తుంది. మీరు ఒక ఇంటికి వెళ్ళిన తరువాత ఆ ఇంటి యొక్క డీటైల్స్ ను సర్చ్ చేసి చూడవచ్చును. సర్చ్ బాక్స్ లో వారి యొక్క పేరు లేదా ఆధార చివరి 4 అంకెలు ఎంటర్ చేసి సర్చ్ చేయవచ్చు. లిస్ట్ లో ఇంట్లో ఏ ఒక్కరి పేరు అయిన చూపించవచ్చు. మీరు సర్చ్ చేసిన household మీద క్లిక్ చేసిన తరువాత ఏ విషముగా చూపిస్తుంది

Geotaging Survey

  • ఈ సర్వే లో ముందు గా household యొక్క ఇంటి రకము ను సెలెక్ట్ చేసుకో వలేను. ఈ లిస్ట్ లో మొత్తం 6 రకాల ఇళ్లను చూపించటం జరుగుతుంది అందులో సరి అయిన ఇంటికి సెలెక్ట్ చేయవలెను Geotaging Survey
  • House type ను సెలెక్ట్ చేసిన తరువాత ఇంటి యొక్క దూర నెంబర్ వేయ వలేను. డోర్ నెంబర్ ఇంటి యాజమాణిని అడిగి తెలుసుకోవచ్చు లేదా ఆధార కార్డ్ లో చూసి ఎంటర్ చేయవచ్చు.
  • డోర్ నెంబర్ వేసిన తరువాత ఇంటి యొక్క ఫోటో తీయవలెను. ఇంటిని ఫోటో తీసే ముందు మీ యొక్క మొబైలు లో Location on చేసి ఉండవలెను . తరువాత ఫోటో తీసి సబ్మిట్ చేయండి.
  • ఫోటో తీసిన తరువాత ఇంటి లో ఎవరైనా అందుబాటులో ఉన్న వ్యక్తి ని biometric లేదా facial ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

5. Final Step :

ఇంటి యొక్క ఫోటో తీసిన తరువాత ఫైనల్ గా సర్వే ను సబ్మిట్ చేసి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తరువాత ఈ విధం గా చూపిస్తుంది.

Geotaging Survey

  • సర్వే పూర్తి చేసిన ఇల్లు green color లో చూపించటం జరుగుతుంది గమనించ గలరు

Household Geotagging Survey Report :

Household Geotagging Survey యొక్క రిపోర్ట్ ను కింద ఇవ్వబడిన లింకు ద్వారా మీరు తెలుసుకోవచ్చు. లింకు ఓపెన్ చేశాక మీయొక్క జిల్లా, మండలం, మరియు సచివాలయం సెలెక్ట్ చేసి మీ సచివాలయం యొక్క పూర్తి ప్రోగ్రెస్ తెలుసుకోగలరు.

Report Link : Click Here

ఈ Households GeoTagging Survey నవంబర్ 15 లోగా పూర్తి చేయవలెను అని ప్రభుత్వం వారు ఆదేశించి యున్నారు. కావున సెక్రెటరీ లు అందరూ త్వరగా ఈ సర్వే పూర్తి చేయవలెను.

సర్వే గురించి ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో స్పందించగలరు. ఇలాంటి మరిన్ని సచివాలయ updates కోసం మన telegram చానెల్ లో జాయిన్ అవ్వగలరు మరియు మన వెబ్సైట్ ను ఫాలో అవ్వగలరు.

 

 

 

Leave a Comment